వివిధ కోర్టుల్లో ఏళ్లతరబడిగా పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారం ఇక సత్వరం జరగనుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి ఈ ప్రాసిక్యూషన్ విధానాన్ని మొదటిసారి అమలు చేయాలని యూపీ సర్కారు నిర్ణయించింది.
యూపీలో మరో వారం రోజుల్లో కేసుల సత్వర దర్యాప్తునకు ఈ ప్రాసిక్యూషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు యూపీ రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శి అవనీష్ అవస్థీ వెల్లడించారు.
దీనిలో భాగంగా లక్నో నగరంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు, పోలీసులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
కోర్టులో సాక్షులు హాజరయ్యేందుకు వీలుగా వారికి ఎస్ఎంఎస్ లు అందించాలని, ప్రభుత్వ న్యాయవాదులకు మొబైల్ ఫోన్ ద్వారానే కేసుల దర్యాప్తు తేదీలను తెలియజేయాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు.
కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ ప్రాసిక్యూషన్ విధానంలో డేటాబేస్ ను ఏర్పాటు చేశామని సర్కారు ప్రకటించింది.