తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ను మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు కలిశారు. నాందేడ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి తెరాస అభ్యర్థులుగా తాము పోటీ చేస్తామని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. మహారాష్ట్రలోనూ తెరాస ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. అక్కడ తెరాస ఏర్పాటుకు అనుమతించారు. నాందేడ్ జిల్లా నేతలు కేసీఆర్‌ను కలవడం.. తెరాస ఏర్పాటుకు ఆయన అనుమతి ఇవ్వడంతో మహారాష్ట్రలోనూ పార్టీ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశముంది. అధినేత అనుమతిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు బరిలోకి దిగే వీలుంది. మరోవైపు అక్కడి ఎన్నికల్లో పోటీపై తెరాస ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
నాందేడ్ జిల్లా నుండి తెరాస మహారాష్ట్ర ప్రారంభం
Related tags :