NRI-NRT

కోడెలకు డీసీలో ఘన నివాళి

Washington DC NRI TDP Offers Tributes To Kodela

ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల వాషింగ్టన్ డీసీ ఎన్నారై తెదేపా సంతాపాన్ని తెలిపింది. సోమవారం సాయంత్రం వర్జీనియాలోని మయూరిలో కోడెల సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా శ్రేణులు మన్నవ సుబ్బారావు, వేమన సతీష్, ఎన్.ఆర్.సీ.నాయుడు, సత్యా సూరపనేని, ఉప్పుటూరి రాంచౌదరి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.