యువ హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగవ సినిమాను చేస్తున్న విషయం తిలిసిందే. అల్లు అరవింద్ బ్యానర్ లో అఖిల్ నాలుగా చిత్ర నిర్మాణం అవుతుంది. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలోనే అఖిల్ ఐదవ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అఖిల్ తో ‘హలో’ చిత్రాన్ని నిర్మించిన నాగార్జున మరోసారి తన కొడుకుతో సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ దర్శకుడు పరశురాం కథను సిద్ధం చేయడం..ఆ కథకు నాగార్జున మరియు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందంట. ఈ ఏడాది చివరిలో అకిల్ ఐదవ చిత్ర సెట్స్ పైకి వెళ్ళబోతుంది. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర నిర్మాణం జరుగుతున్నట్లుగా అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. సూపర్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అఖిల్ కు ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి
ముచ్చటగా నాలుగోసారి
Related tags :