Sports

సాకర్ కన్నా శృంగారం కిక్కే మిన్న

Cristiano Ronaldo Says Sex With His GirlFriend Is More Exciting Than His Soccer Goals

సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డొ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఫుట్‌బాల్‌ కెరీర్‌లో చేసిన అత్యుత్తమ గోల్‌ కన్నా తన ప్రేయసి, మోడల్‌ జార్జినా రోడ్రిగెజ్‌తో శృంగారమే ఉన్నతమైందని పేర్కొన్నాడు. ఐటీవీ ఇంటర్వ్యూలో 2018 ఏప్రిల్‌లో రియల్‌ మాడ్రిడ్‌ తరఫున జువెంటాస్‌పై చేసిన ఓవర్‌ హెడ్‌ కిక్‌ గోల్‌ గురించి ప్రశ్నించినప్పుడు అతడీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘కాదు, నా ప్రేయసితో పోల్చినప్పుడు అది అత్యుత్తమ గోల్‌ కాదు!’ అని రొనాల్డొ నవ్వాడు. ‘ఓవర్‌హెడ్‌ గోల్‌ చేసేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. మాములుగా 700 గోల్స్‌ చేసుంటాను. కానీ ఎప్పుడూ దానిని చేయలేదు. జువెంటాస్‌పై సాధించినప్పుడు హమ్మయ్య! ఎట్టకేలకు చేశానని అనుకున్నాను. ఛాంపియన్స్‌ లీగ్‌లో గియానలుగిపై చేసిన ఆ గోల్‌ అత్యంత అందమైంది’ అని రొనాల్డొ అన్నాడు. గూసీ షాప్‌లో రోడ్రిగెజ్‌తో తొలి చూపులోనే ప్రేమ గురించి రొనాల్డొ వివరించాడు. ‘జార్జినా, నా పిల్లలకు తల్లి. ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఆమె నాలో ఓ భాగం. నాకెంతో సాయం చేసింది. బహుశా మీకు తెలుసనుకుంటాను. నేనామెతో ప్రేమలో పడ్డాను. ఆమె నాకు స్నేహితురాలు. తరచూ మేం మాట్లాడుకుంటాం. ఆమె కోసం నా హృదయం తెరిచాను. నా కోసం ఆమె తన హృదయాన్ని తెరిచింది. ఏదో ఓ రోజు మేం కచ్చితంగా పెళ్లి చేసుకుంటాం. మా అమ్మ కోరికా ఇదే. ఏదో ఒక రోజు ఆమెను పెళ్లాడతాను’ అని రొనాల్డొ అన్నాడు.