Food

నోరు కట్టేసుకోలేని వారి కోసం ఈ చిట్కాలు

Diet Control Tips Without Suppressing Cravings

ఎంత వ్యాయామం చేసినా.. కొందరు కంటికి నచ్చిన ఆహారం తినకుండా ఉండలేరు. మీ డైట్‌లోనే కొన్ని మార్పులు చేసుకుంటే… ఫలితం ఉంటుంది. అవేంటంటే!

మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారంతోనే ఉదయం పూట అల్పాహారాన్ని మొదలుపెట్టాలి. దానివల్ల శరీరంలో ఇన్సులిన్‌ సమస్య తలెత్తదు. ఇడ్లీ పిండిలో కాసిని ఓట్స్‌ కలుపుకోవచ్ఛు దోశపిండిలో కొన్ని పెసలూ వేసుకోవచ్ఛు అవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. వీటిల్లోనే కొర్రలు, జొన్నలు వంటివాటిని రవ్వలా చేసుకుని వాడి చూడండి.

* తెల్లబియ్యం తినడం మానలేకపోతున్నాం అనుకునే వారు… బియ్యంలో పావు వంతు కొర్రల్ని కలిపి తిని చూడండి. గుడ్డులోని తెల్లసొన, పాలు, మొలకలు, చీజ్‌, ఓట్స్‌ వంటివి జీవక్రియలను చురుగ్గా ఉంచే పిండిపదార్థాలను విడుదల చేస్తాయి. వీటిని రోజూ కొద్దిగా అయినా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు అందుతాయి. ఇతర పదార్థాలను అతిగా తినాలనే ఆలోచన తగ్గుతుంది.

* రాత్రిపూట భోజనం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. మసాలాలు లేని ఆహారం తినాలి. ఒకవేళ వాటినే తినాలని పదే పదే అనిపిస్తే… కొన్ని మిరియాలు, ధనియాలను పొడిగా చేసుకుని రెండింటినీ పదార్థాల తయారీలో వాడి చూడండి.

* పండ్లు, తగినన్ని నీళ్లు తాగడం మరిచిపోకూడదు. వాటితో జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. శరీరంలో అదనపు కొవ్వు చేరకుండా ఉంటుంది.