రైతు భరోసా పథకం ఈ క్రింద విధంగా ఉన్న రైతులకి మాత్రమే వర్తిస్తుంది.
1.సొంతంగా భూమి ఉంటే 10 సెంట్లు నుండి 5 ఎకరాలు ఉన్న ప్రతీ రైతుకి ఈ పధకం వర్తిస్తుంది.
2..భూ యజమాని చనిపోతే అతని భార్యకి ఈ పథకం వర్తిస్తుంది.
3.తల్లితండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో ఒకరికి మాత్రమే కౌలు కి చేసినట్లు అవుతుంది.
4.కౌలు రైతు అయినట్లయితే 50 సెంట్లు లేదా అంత కంటే ఎక్కువ సాగు చేస్తూ…. అతని పేరునా భూమి లేనట్లయితే ఈ పథకం వర్తిస్తుంది.
5.భూ యజమాని అంగీకారంతోనే కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది.
6.భూ యజమాని తన భూమిని 3 లేదా 4 కి కౌలుకి ఇచ్చినట్లయితే …….. భూ యజమానితో పాటు ఆ కౌలు రైతులలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
7.D పట్టా భూముల్లో సాగు చేస్తున్నా రైతులకి కూడా ఈ పథకం వర్తిస్తుంది.
8.ఆన్ లైన్ లో భూమి నమోదు కాని రైతు కి కూడా ఈ పధకం వర్తిస్తుంది.
9.ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్నా రైతులు కూడా ఈ పధకం వర్తిస్తుంది.
10.స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నా ఉద్యోగుల్లో (గుమాస్తాలు, క్లాస్ 4 సిబ్బంది, గ్రూప్ D )రైతులు ఉన్నచో ఈ పథకం వర్తిస్తుంది.
రైతు భరోసా పథకం ఈ క్రింది విధంగా ఉన్న రైతులకి వర్తించదు.
1.రాజ్యాంగ బద్దమైన పదవులు చేపట్టిన ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. (మాజీ సర్పంచ్, మాజీ mptc, EX ZPTC, Ex MPP, Ex MLA)
2.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఐనట్లైతే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదు.
3.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేసి…. పదవి విరమణ చేసినట్లయితే ఈ పథకం వర్తించదు.
4.వ్యవసాయ భూములను ఇల్లా పట్టాలుగా మార్చుకుంటే ఈ పథకం వర్తించదు.
5.వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చుకున్నా కూడా ఈ పథకం వర్తించదు.
6.గత ముగింపు సంవత్సరానికి వాణిజ్య వృత్తి పన్నులు (Tax), GST చెల్లించిన వారికీ ఈ పథకం వర్తించదు.
7.వృత్తిపరమైన సంస్థల క్రింది రిజిస్టరై తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్క్ లు కూడా వర్తించదు.
8.నెలకి రూ 10000 లేదా అంతకంటే ఎక్కువ పింఛన్ పొందుతున్నా వారికి ఈ పథకం వర్తించదు.
9. భూమి …. భూ యజమాని ( తండ్రి లేక తల్లి )పేరున ఉంటే….. వాళ్లలో ఎవరైనా బ్రతికి ఉంటే….. ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారసులకు ఈ పథకం వర్తించదు.
10.బంజరు లేదా బీడు భూములకు ఈ పథకం వర్తించదు.