WorldWonders

ఈ గ్రహాంతర జీవి పేరు ర్యాట్‌ఫిష్

Norway Fisherman Catches Scary Ratfish

ఉత్తర నార్వేలోని అండోయా ద్వీపం సమీపంలో సముద్రంలో ఆస్కార్‌ లుంధాల్‌ అనే చేపల వేట శిక్షకుడి గాలానికి చిక్కిన వింత చేప ఇది. గుండ్రటి పెద్ద కళ్లతో గ్రహాంతర జీవిని పోలి ఉన్న ఈ చేపను చూడగానే తనకు పడవ నుంచి దూకేయాలన్నంత భయం వేసిందని ఆయన చెప్పారు. ఈ ర్యాట్‌ఫిష్‌ లాటిన్‌ పేరు ఛిమోరా మోన్‌స్ట్రొసా లినియాస్‌. గ్రీకు ఇతిహాసాల ఆధారంగా ఈ పేరు వచ్చింది. అత్యంత లోతైన సముద్రాల్లో అట్టడున ఈ చేపలు ఉంటాయి. మత్స్యకారుల వలలకు లేదా గాలాలకు అరుదుగా చిక్కుతాయి