ధిల్లీ భామ రాశీ ఖాన్నా ముద్దుగా, బొద్దుగా ఉంటూ అందరినీ అలరించే టాలెంట్ తన సొంతం అంటుంది. ఇక ఈ బొద్దుగుమ్మ సన్నగా అవ్వాలని డిసైడ్ అయి చాలా కాలం నుంచీ ఆమె జీరో సైజ్ కోసం బాగా ట్రై చేస్తోందంట. ముఖ్యంగా జిమ్ కి వెళ్లి ఒకేలా కసరత్తులు చేసిందంట. అలాగే నోటికి తాళం వేసుకొని ఎన్నో కంట్రోల్ చేసుకుందట. అన్ని చేసినా కూడా తగ్గడం లేదుట. దాంతో ఇక లాభం లేదని బాధ పడుతుంటే, తెలిసిన వారెవరో హిమాలయాలకు వెళ్ళమన్నారట. అక్కడ ఆనందాశ్రమానికి వెళ్తే రాశి బాడీ కఫా తత్త్వం అని చెప్పారంట. దానికి తగట్టుగా డైట్ తీసుకుంటూ కసరత్తులు చేస్తే సంసన్నబడతారని చెప్పారంట. ఇప్పుడు దాని ఫలితం తనకు కనిపిస్తోందని, తాను బాగా తగ్గేందుకు ట్రై చేస్తున్నానని అంటోంది. మొత్తానికి హిమాలయాలకు వెళ్లి అనుకున్నది సాధించిన రాశీ ఖన్నాను అందరూ అభినందిస్తున్నారు.
హిమాలయాల్లో కసరత్తు
Related tags :