* స్టాక్ మార్కెట్ కు వరుసగా రెండో రోజూ చమురు ధరల సెగ తాకింది. దీంతో సూచీలు భారీ నష్టాన్ని మూతకట్టుకోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ ఉదయం 37,169.46 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ..ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒక దశలో 36,419.09 పాయింట్ల వద్ద కనిష్టానికి పడిపోయిన సెన్సెక్స్, చివరకు 642.22 పాయింట్ల నష్టంతో 36481.09 పాయింట్ల వద్ద ముగిసింది
* కీలక చమురు క్షేత్రాలపై దాడుల ఫలితంగా సౌదీ అరేబియా ముడి చమురు ఉత్పత్తి తగ్గినా నేపధ్యంలో ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై భారత్ దృష్టి సారించింది. మరిన్ని చమురు ఉత్మట్టి దేశాల నుంచీ దిగుమతులు పెంచుకునే యత్నాలను ముమ్మరం చేసింది
* ఎంఎంటీసి, ఎస్ టీసీ, పీఈసి సంస్థలను మూసివేయడం లేదా విలీనం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయాల్ వెల్లడించారు.
* ప్రపంచంలో అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలోకి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మూడేళ్ళలో చేరుతుందని ఒక నివేదిక అంచనా వేస్తుంది. సమాచార సేవల సంస్థ డబ్ల్యూపీపీ, మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్ మిల్ వార్డ్ బ్రౌన్ సంయుక్తంగా ‘ప్రపంచ అత్యంత విలువైన బ్రాండ్ల జాబితా’ను ఏటా రూపొందిస్తున్న సంగతి విదితమే
* లెక్ట్రో ఇ-సైకిల్ శ్రేణిని దేశీయ విపనిలోకి విడుదల చేసేందుకు జపాన్ కు చెందిన యమహా మోటార్ కంపెనీతో జత కట్టినట్లు హీరో సైకిల్స్ మగళవారం వెల్లడించింది
* నెమ్మదించిన ఆర్ధిక వ్యవస్థకు ప్రోత్సాహం అందించేందుకు ఆర్ధిక శాఖా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే మూడు దఫాల్లో వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మరో ఉద్దీపన ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆర్ధిక శాఖా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు
* బ్యాంకింగ్, ఆర్ధిక సేవలు, బీమా రంగాల అంకురా సంస్థలు అన్నీటిని ఒక చోటకు తీసుకొచ్చే లక్ష్యంతో హైదరాబాద్ ఫిన్ టెక్ ఫోరం (హెచ్ ఎఫ్ ఎఫ్ ) ప్రారంభమైంది. ఆయా సంస్థల మధ్య నెట్వర్కింగ్ పెంచడంతో పాటు పరస్పరం సహకరించుకునేందుకు ఈ వేదిక తోడ్పడనుంది
* కాఫీ డే ఎంటర్ ప్రైజర్స్ కు చెందినా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ ను ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్ స్టోన్, సలార్ పూరియా సత్వా గ్రూప్ లు రూ.2700 కోట్లకు కొనుగోలు చేశాయి
* బండ్లు, రుణాలు, విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.2500 కోట్ల నిధుల్ని సమీకరించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం లభించిందని ప్రభుత్వ రంగ జల విద్యుత్ దిగ్గజం ఎం హెచ్ పీ సి వెల్లడించింది
* 1వ తేదీ నుండి ఆర్ బీ ఐ రేపో రేటు అనుసందానిత రుణాలు ఖాతాదారులకు అందచేస్తామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది
* అర్హులైన సంస్థాగత మదుపర్లకు (క్యూఐపీ) షేర్ల జారీ ద్వారా రూ.8500 కోట్ల నిధుల్ని సమీకరించబోతున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది
* వచ్చే 10-12 రోజుల్లో రీడు విడత బండ్ల జారీ ద్వారా రూ.15000 కోట్ల వరకు సమీకరించాలని ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ సన్నాహాలు చేస్తుంది
* నేటి డాలరు మారకపు ధర రూ.71.26
* నేటి 10గ్రాముల బంగారం ధర రూ.38,990
* నేటి కిలో వెండి ధర రూ.48765
రెండో రోజూ చమురు ధరల సెగ-వాణిజ్యం-09/18
Related tags :