Fashion

బెల్ట్ పెట్టుకో…కర్వీ లుక్స్ పట్టుకో

Wearing Belt Might Give You A Curvy Look-Telugu Fashion News

కర్వీ బాడీ… కొంతమంది అమ్మాయిల శరీరాకృతి ఇది. ఇలాంటివారు అధికబరువు ఉండరు కానీ… వీళ్ల ఆకృతి సరిగ్గా కనిపించాలంటే… ఫ్యాషన్‌ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.

* ఇలాంటివారు కాస్త వదులుగా ఉండే దుస్తుల్ని వేసుకుంటే… శరీరంలోని లోపాలు కనిపించకుండా చేయొచ్చనుకుంటారు కానీ… కాదు. ఒంటికి అతికినట్లుగా సరిపోయే దుస్తుల్ని వేసుకోవాలి. ఒకవేళ సౌకర్యంగా ఉండాలనుకుంటే… ఒక అంగుళం వదులుగా ఉండేలా చూసుకుంటే చాలు.
* పాశ్చాత్య వస్త్రశ్రేణి ఎంచుకునేవారు… బెల్టు పెట్టుకుని చూడండి. శరీరాకృతి సరిగ్గా ఉంటుంది. ఒకవేళ కాస్త బరువున్నా అంతగా కనపడదు.
* ఇలాంటివారికి నిలువుగీతలు చక్కగా నప్పుతాయి. వీటిని రకరకాల డిజైన్లలో ఎంచుకోవడం వల్ల ఎత్తుగా, సన్నగా కనిపిస్తారు.
* మెడ పొడుగ్గా కనిపించేలా చేసేందుకు వీలైనంతవరకు ఆంగ్ల వి ఆకారంలో ఉండే మెడ డిజైన్లు ప్రయత్నించాలి. వీరు పేస్టల్‌ రంగుల్ని ఎంచుకుంటే మంచిది.
* ఒకవేళ సంప్రదాయ వస్త్రశ్రేణికి ప్రాధాన్యం ఇస్తుంటే… స్ట్రెయిట్‌ కుర్తాలు సరైన ఎంపిక. జతగా సిగరెట్‌ ప్యాంట్లు, కొల్హాపురీ చెప్పులు వేసుకుంటే చాలు.

Image result for belt and curvy look imagesize:640x480

Image result for belt and curvy look imagesize:640x480

Image result for belt and curvy look imagesize:640x480

Image result for belt and curvy look imagesize:640x480