Business

38వేలకు బంగారం ధర

38వేలకు బంగారం ధర

గత కొన్ని రోజుల వరకూ అడ్డు అదుపులేకుండా పెరిగిన పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.38,454కు చేరింది. పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ముందుకు రాకపోవడం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా రూ.380 తగ్గి రూ.47,310కు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, మదుపరుల నుంచి పెట్టుబడులు ఆశాజనకంగాగా లేకపోవడం బంగారం ధర తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌కు చెందిన సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. ఔన్సు 1,497 డాలర్లుగా ఉండగా, వెండి 17.72 డాలర్లు పలికింది.