భారత, అమెరికా మధ్య సైనిక విన్యాసాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలోని మెకార్డ్ జాయింట్ బేస్ లూయిస్ వద్ద యుద్ధ అభ్యాస్ విన్యాసాలు నిర్వహించారు.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 16 వరకు అభ్యాస్ విన్యాసాలు చేపట్టారు.
అయితే విన్యాసాలు ముగింపు రోజున.. అక్కడ భారత జాతీయ గీతం జనగణమణ పాటను అమెరికా సైనికులు వినిపించారు.
అమెరికన్ ఆర్మీ బ్యాండ్ .. భారత జాతీయ గీతాన్ని ప్లే చేసింది.
అమెరికా సైనికులు జనగణమణ పాటను తమ బ్యాండ్‌లో వినిపించడం పట్ల భారతీయ సైనికులు సంతోషానికి లోనయ్యారు.
అస్సాం రెజిమెంట్‌కు సంబంధించిన ఓ పాటపై రెండు దేశాల సైనికులు చిందులు కూడా వేశారు