Movies

పిల్లలతో అదే గోల

Mallika Sherawat On Having Kids

బాలీవుడ్‌లో ‘మర్డర్’, ‘వెల్‌కం’, ‘హిస్’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మల్లికా శెరావత్‌. బిజీ షెడ్యూల్‌లో కూడా తన మేనల్లుడు రణ్‌షేర్‌తో కలిసి సరదాగా గడుపుతుంటారు ఈ నటి. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను పిల్లల గురించి అడగగా.. ‘నాకు పిల్లలు లేరు. నా మేనల్లుడే నాకు బేబి. నేను తనతో చాలా సంతోషంగా గడుపుతాను. ఆనందంగా ఆడుకుంటాను. తిరిగి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగిస్తాను.’ అని చెప్పారు. అంతేకాకుండా ఆమె తల్లి అయ్యేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. ‘మాతృత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. నాకు అలాంటి బాధ్యత వద్దు. నాకే కనుక పిల్లలు ఉంటే వాళ్ల గురించి ఎప్పడూ ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఇలాగే సంతోషంగా ఉన్నాను.’ అని మల్లికా శెరావత్‌ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త సిరిల్ ఆక్సెన్‌ఫాతో మల్లిక కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే మళ్లీ తనకు ప్రేమలో పడాలని ఉందని ఆమె తెలిపారు. ‘ఇప్పటికైతే నేను సింగిల్‌గానే ఉన్నాను. కానీ తిరిగి ప్రేమలో పడాలని ఉంది. చాలా మంది తారలు సింగిల్‌గా ఉన్నారు. సింగిల్‌గా ఉంటే చాలా మంది చాలారకాలుగా అనుకుంటారు. కానీ నేను అవేమి పట్టించుకోను.’ అని మల్లిక అన్నారు.