సాధారణంగా ఎక్కువ శాతం మంది బీరకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సులువుగా జీర్ణమయ్యే కూరగాయల్లో బీరకాయ ఒకటి. విరేచన కారి కూడా. అందువలన పథ్యంగా బీరకాయ చాలా మంచిది. లేత బీరపొట్టు వేపుడు జ్వరంను తగ్గిస్తుంది. బీరకాయలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి. బీరకాయలో పందిరి బీర, పొట్టి బీర, నెతి బీర, గుత్తి బీర అని వివిధ రకాలు ఉన్నాయి. అయితే బీరకాయలో కొవ్వు, కొలస్త్రాల్ శాతం తక్కువగా ఉనడడం వాళ్ళ బరువు తగ్గుదాం అనుకునే వాళ్లకి ఇది చక్కటి ఆహారం. ఆకలి తీరుస్తోనే బరువు తగ్గించడంలో బీరని మించింది లేదని నిపుణులు అంటున్నారు.
బీరకాయతో బరువు అదుపు
Related tags :