ScienceAndTech

వేళ్లు మొహం అయ్యాయి. ఇప్పుడు చెవిలో గుబేలుతో అన్‌లాక్!

Unlock Your Phone With Hearing Pattern | TNILIVE Telugu SciTech News

హెడ్‌ఫోన్‌ను చెవిలో పెట్టుకోగానే స్మార్ట్‌ఫోన్‌ అన్‌లాక్‌ అయ్యే సరికొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. అమెరికాలోని బఫలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఝన్‌పెంగ్‌ జిన్‌ చిన్న మైక్రోఫోన్‌తో కూడిన ‘ఇయర్‌ఎకో’ అనే హెడ్‌ఫోన్‌ను అభివృద్ధి చేశారు. వ్యక్తుల చెవుల్లో ధ్వని ప్రయాణించే తీరును గుర్తించి ఈ వైర్‌లెస్‌ బయోమెట్రిక్‌ పరికరం స్మార్ట్‌ఫోన్లను అన్‌లాక్‌ చేస్తుంది.