తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో షీన్ సర్వీసెస్ మరియు ఇండో ఖతార్ జాబ్స్ సంయుక్త సహకారంతో దోహాలో యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణా సదస్సును నిర్వహించారు. క్యాప్ జెమిని మానవ వనరుల డైరెక్టర్ సజ్జాద్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ యువతకు కావలసిన నైపుణ్య అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో నైపుణ్యం లేనిదే చేస్తున్న వృత్తిలో తట్టుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. భారతదేశంలో మానవ వనరులకు లోటు లేదని వారిలో 65శాతం మంది 35 సంవత్సరాల లోపు ఉన్న యువకులేనని ఏటా కోటి మందికి పైగా పెరుగుతూ వస్తున్నారని ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఈ మార్పులో భాగస్వాములు కావలసిందిగా యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణా జాగృతి ఖతర్ ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న, కార్యవర్గ సభ్యులు ఎల్లయ్య తాల్లపెళ్లి, సాయిగిరి వంశీ, షీన్ సర్వీసెస్ అధినేత లూత్ ఫి అహ్మెద్, ఆశ్ఫక్ ఆమేర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణా సదస్సు
Related tags :