Food

అవిసెలు కొంచెం తిన్నా కడుపు నిండుతుంది

Flax Seeds Health Benefits - Telugu Food News

కొన్ని పదార్థాల్ని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ… వాటివల్ల కలిగే మేలు అంతాఇంతా కాదు. అవేంటీ, వాటిని రోజువారీ ఆహారంలో ఎందుకు భాగం చేసుకోవాలి? చూద్దామా…
* అవిసెగింజలు: వీటిని కొద్దిగా తీసుకున్నా చాలు… పొట్టనిండిన భావన కలుగుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే… ఒమేగా త్రీ ఫ్యాటీఆమ్లాలు శరీరానికి అందుతాయి. హార్మోన్ల అసమతూకం సమస్య ఎదురుకాదు. ఈ గింజల్ని పొడిచేసుకుని పెట్టుకుంటే అన్నిరకాల పదార్థాల్లో అరచెంచా చొప్పున వేసుకోవచ్చు.
* బొప్పాయి: ఎ, ఇ, సి విటమిన్లు పుష్కలంగా లభించే ఈ పండు… మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. నెలసరి సజావుగా వచ్చేలా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్నిరకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. రోజూ కప్పు బొప్పాయి ముక్కలు తింటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
* పెరుగు: మనమంతా రోజూ పెరుగన్నం తింటాం…అది మాత్రమే సరిపోదు. అదనంగా రోజులో మరో రెండు కప్పులు పెరుగు తిన్నా మేలే. ఇలా చేస్తే ట్రైగ్లిజరాయిడ్ల సమస్య అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెరస్థాయులూ సమతూకంలో ఉంటాయి. శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది. ఎముకలూ దృఢంగా మారతాయి.
* ఆకుకూరలు: వీటిని రోజూ తీసుకుంటే మహిళలకు అవసరమైన క్యాల్షియం, మాంసకృత్తులు, ఫోలిక్‌యాసిడ్‌, ఇనుము… వంటి పోషకాలన్నీ అందుతాయి.
* టొమాటోలు: వీటిల్లోని లైకోపీన్‌ అనే పదార్థం ఫ్రీ రాడికల్‌్్సతో పోరాడి చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. సహజ ఎస్‌పీఎఫ్‌గా చర్మంపై ఎండ ప్రభావం పడకుండా కాపాడుతుంది.