♦ పిల్లలకు మసాజ్ చేసే ఆయిల్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే తరచుగా చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఒంటికి రుద్దిన ఆయిల్ కడుపులోకి పోయే అవకాశం ఉంది. ఆయిల్ కొనే ముందు తయారీకి ఏమేమి వాడారో లేబుల్‌ను చెక్ చేసుకోవాలి. వెన్న, మీగడ వంటివైతే ఏ ఇబ్బంది ఉండదు.
♦ మసాజ్ చేయడానికి ఆయిల్‌ను అరచేతిలోకి వంపుకుని రెండు చేతులతో రుద్ది పాపాయి ఒంటి మీద కొద్దిగా రాసి పాపాయి కదలికలను గమనించాలి. ముఖ్యంగా కళ్లలోకి చూస్తే కొత్త రకం స్పర్శకు స్వాగతం పలుకుతోందా వద్దని చిరాకు పడుతోందా అన్నది తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఒంటికి కొత్త స్పర్శ తగిలిన వెంటనే తల అడ్డంగా తిప్పుతూ, కాళ్లు చేతులు విదిలిస్తూ తమ అయిష్టతను వ్యక్తం చేస్తారు. అలాంటప్పుడు ఒంటికి నూనెను కొద్దికొద్దిగా రాస్తూ పాపాయిని మసాజ్‌కు మానసికంగా సిద్ధం చేయాలి. ఆ తర్వాత ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా చేయించుకుంటారు.
పిల్లల మసాజ్‌కు ఒక లెక్క ఉంది
Related tags :