మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఈ క్రమంలోనే యాపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలను రాకుండా కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా యాపిల్ పండ్ల వల్ల న్యుమోనియా వ్యాధి రాకుండా చూసుకోవచ్చని పలువురు సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో పలువురు సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయన వివరాలను తాజాగా ప్రచురించారు. వాటి ప్రకారం… యాపిల్ పండ్లను తినడం వల్ల న్యుమోనియా రాకుండా ఉంటుందని తేలింది. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని సైంటిస్టులు తేల్చారు. నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని వారంటున్నారు.
మీకు న్యూమోనియా భయం ఉందా?

Related tags :