NRI-NRT

గుంటూరులో నాట్స్ T20 ప్రారంభం

NATS T20 Tournament Started In Guntur

నాట్స్-Pragma Edge సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వింజనంపాడులో T20 పోటీలు నేటి నుండి KKR & KSR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రారంభం అయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ₹10వేలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు ₹7వేలను బహుమతిగా అందజేస్తారు. నేడు జరిగిన పోటీలకు ముఖ్య అతిథిగా Pragma Edge Delivery Director బోడపాటి రాజేశ్‌బాబు హాజరయి పోటీలను ప్రారంభించి జట్లకు తమ శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో పాల్గొనే పలు జట్లకు నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు శుభాభినందనలు తెలిపారు.