Fashion

చాక్లెట్-శనగపిండి కలిపి మొహానికి పట్టిస్తే…

Telugu Fashion Beauty Tips - Chocolate Basin Powder Face Pack

చాక్లెట్‌ని చూస్తే చాలు… మనలో చాలామందికి నోరూరుతుంది. దీన్ని సౌందర్య పోషణకూ వాడొచ్చని మీకు తెలుసా!
* చాక్లెట్‌ను కరిగించి దానికి చెంచా తేనె, కాస్త సెనగపిండి కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఆరాక వేళ్లను నీళ్లతో తడుపుకుని మృదువుగా ఓ ఐదు నిమిషాలు రుద్దాలి. ఇలా చేస్తే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖంపై మృతకణాలు తొలగిపోతాయి.
* ముఖంపై ముడతలు కనిపిస్తుంటే… కరిగించిన చాక్లెట్‌లో రెండు చెంచాల గుడ్డులోని తెల్లసొన, రెండు చుక్కల బాదం నూనె కలిపి గిలకొట్టాలి. దీన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది.
* చర్మం పొడిబారినప్పుడు… ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు చాక్లెట్‌పొడిలో తగినంత గులాబీనీరు కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే మంచిది. ముఖం తాజాగా కనిపిస్తుంది.