అమెరికాలోని నూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరంలో శనివారం నాడు 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు, 9వ బాలు సంగీతోత్సవాలు వంశీ రామరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేగేశ్న ఫౌండేషన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. తెలుగు కళా సమితి మరియు నూజెర్సీ తెలుగు అస్సొషియేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి రాధా కాశీనాధుని వ్యాఖ్యాతగా వ్యవహరించగా మూర్తి భావరాజు, బండారు రాజారావు, ప్రభా రఘునాధ్ సహకారం అందించారు. ఈ సంగీత విభావరిలో తాతా బాలకామేశ్వరరావు, స్థానిక కళాకారులు వంశీప్రియ, శ్రీకర్, క్రిష్ణ, అంజని నందిభొట్ల, అంజలి చెన్నాప్రగడ, రవి కామరసుల మధురగీతాలు అతిథులను అలరించాయి. తారిక-తన్వికల నాట్యం ఆకట్టుకుంది. రవి కొండబోలు, మంజు భార్గవ, ఉషా రావిళ్ళలు వేగేశ్న ఫౌండేషన్ సేవలను ప్రస్తుతించారు. వేగేశ్న ఫౌండేషన్ ద్వారా గత 32 సంవత్సరాలలో వేలాది బీద దివ్యాంగ బాలబాలికలని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది, ప్రస్తుతం సుమారు 500 మంది బీద, అనాధ వికలాంగ బాలబాలికలకి జీవనోపాధికి కావలసిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం కల్పిస్తున్నామని వంశీ రామరాజు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విరాళాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు కళా సమితి నుండి సుధాకర్ ఉప్పాల, మధు రాచకుళ్ళ, రేణు తాడేపల్లి,జ్యోతి గండి, నూజెర్సీ తెలుగు అస్సొషియేషన్ నుండి మంజు భార్గవ, కృష్ణవేణి, ఉషా రావిళ్ళ తదితరులు పాల్గొన్నారు.
న్యూజెర్సీలో వేగేశ్న ఫౌండేషన్ 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు
Related tags :