పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్ట్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు ఇచ్చింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు నోటీసులిచ్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ లాయర్ టి.యోగేష్ దాఖలు చేసిన పిల్‌ను బెంచ్ విచారించింది.
గత ఏడాది ఆగస్టు 2తో గడువు ముగిసినా ఇప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించలేదని యేగేష్ చెప్పారు. గ్రామాల్లో ప్రజాపాలన లేదని, ఫలితంగా అభివృద్ధి ఆగిపోతోందన్నారు.