Fashion

ఆముదంతో మందంగా కనుబొమ్మలు

Castor Oil Massage Improves Eyebrow Thickness

మనలో చాలామందికి కనుబొమలు అనుకున్నంత మందంగా ఉండవు. వాటిని ఆరోగ్యంగా, ఒత్తుగా ఎలా మార్చుకోవాలంటే…

కొబ్బరినూనెతో: కనుబొమలకు క్రమం తప్పకుండా కొబ్బరినూనె రాయాలి. ఈ నూనెలోని పోషకాలు కనుబొమలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

ఆముదంతో : ఈ నూనెలో మాంసకృత్తులు, ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కనుబొమలు పెరగడానికి దోహదపడతాయి. రాత్రుళ్లు ఈ నూనెను కొద్దిగా రాసుకుని మర్దన చేయాలి.

కలబందతో : ఈ గుజ్జులో కెరొటిన్‌ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కనుబొమలు పెరిగేలా చేస్తాయి. దీన్ని పూతలా రాసుకుని ఆరాక కడిగేయాలి.

పెట్రోలియం జెల్లీతో : ఇది కుదుళ్లకు పోషణనిచ్చి కనుబొమలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసుకుని మర్దన చేస్తే చాలు. వాటిని షేప్‌ చేయించుకునేటప్పుడూ దీన్ని రాసుకోవచ్చు.