Movies

రెడ్డిగారితో చాణక్యుడి పోటీ

Gopichand Chanakya And Syeraa Clashing Release Dates

‘సైరా’ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అనుకున్నట్టే చాలా గ్రాండ్‌గా జరగడంతో భారీ బజ్‌తో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది ‘సైరా’. టాలీవుడ్‌లో ఏదైనా ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అంటే ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుని దానికి తగ్గట్టుగా డేట్స్ మార్చుకుంటుంటారు. రీసెంట్‌గా ‘సాహో’ సినిమా లేట్‌గా రిలీజ్ అవ్వడం వల్ల ముందే ఆ డేట్ లాక్ చేసుకున్న ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ వెనక్కి వెళ్ళింది. అక్కడ ‘గద్దలకొండ గణేష్‌’తో క్లాష్ రావడంతో మళ్ళీ అక్కడ వాళ్లిద్దరూ మాట్లాడుకుని వారం తేడాలో ప్రేక్షకులముందుకు వచ్చారు. గతంలో కూడా ‘బాహుబలి’ రీలీజ్ అవుతున్నప్పుడు కూడా ముందుగా ఆ డేట్‌కి మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమా రిలీజ్ ఫిక్స్ అయ్యి ఉంది. కానీ ‘బాహుబలి’ గురించి ‘శ్రీమంతుడు’ సినిమాని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఒక్క పండగల టైమ్‌లో తప్పించి ఎప్పుడూ కూడా సినిమాలు పోటీపడి రిలీజ్ చెయ్యడం అనే పద్దతిని పూర్తిగా వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రంగా చాలా డేర్ చేస్తున్నాడు గోపీచంద్. అసలే ఫ్లాప్స్ తో ఉన్న గోపీచంద్ ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ తిరుతో కలిసి భారీ బడ్జెట్ తో ‘చాణక్య’ అనే స్పై థ్రిల్లర్ చేసాడు. అయితే ఆ షూటింగ్ మధ్యలో గోపీచంద్ కాలికి గాయం అవ్వడంతో చాలా రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ షూటింగ్ అంతా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆ సినిమాని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తుండడం ఇక్కడ హైలైట్.