18 ఎకరాల భూమికి పరిహారం ఇప్పించాలి: హీరో వడ్డే నవీన్
హీరో వడ్డే నవీన్ కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కృష్ణా జిల్లా కె.మాధవరంలో తమ భూమికి సంబంధించిన వ్యవహారంలో నవీన్ ప్రభుత్వానికి అర్జీ అందించారు.
తమ 18 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం ఇప్పించాలని తన వినతిపత్రంలో కోరాడు.
1973లో భూసంస్కరణల్లో భాగంగా తమ మామిడి తోటను తీసుకున్నారని,
అయితే, ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని వివరించారు.
దీనికి సంబంధించిన అన్ని పత్రాలను అధికారులకు చూపించారు.
అంతకుముందు, వడ్డే నవీన్ తనవంతు వచ్చేవరకు సామాన్య ప్రజల్లో ఒకడిగా క్యూ లైన్లో నిలుచున్నారు.