* పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చి చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది
* మాజీ మంత్రి యరపతినేని పై సిబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయనపై అభియోగాలతో కేంద్రానికి లేఖ రాసింది
* వోక్స్వాగన్ కేసులో మంత్రి బొత్స నేడు సేబేఐ కోర్టు ముందు హాజరయ్యారు
* హాస్యనటుడు వేణుమాధవ్ చావుబతుకుల మధ్య యశోదా ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు
* భూకంపం ధాటికి పాకిస్తాన్ లో 15 మంది మృతి చెందారు
* bsnl దేశవ్యాప్తంగా 4గ్ సేవలకు సిద్ధం అవుతుంది
* ఏసిబీ ఇటీవల హైదరాబాద్ లో ఏసిబీ కి చిక్కిన తహసిల్దారు లావణ్యను నేడు అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు
* కిలో ఉల్లి ధరను రూ.25 తగ్గించి విక్రయిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది
* కోదాడ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ కుమార్ రెడ్డీ భార్య పద్మావతిని అధిష్టానం ప్రకటించింది
* అమరావతికి త్వరలో రైలు సౌకర్యాన్ని కల్పిస్తామని సికింద్రాబాద్ రైల్వే జీఎం మాల్యా ప్రకటించారు
* కృష్ణా నది కరకట్టపై తాను నిర్మించిన అతిధి గృహం అక్రమ కట్టడం కాదని , అన్ని అనుమతులు తీసుకున్నానని దాని యజమాని లింగమనేని రమేష్ ముఖ్యమంత్రికి ఐదు పేజీల లేఖ రాసారు
* ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను తిరగతోడాలని ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీవోను హై కోర్టు నిలిపివేసింది
* దేశంలో తొలిసారిగా ఒక రాజకీయ పార్టీ (మజిలిస్) టిక్ టాక్ అకౌంట్ ను ఓపెన్ చేసింది
TNI ఫ్లాష్ న్యూస్…
Related tags :