NRI-NRT

డెట్రాయిట్‌లో తానా బ్యాగుల పంపిణీ

Detroit TANA Distributes 288 Backpacks To Poor Kids In Michigan

తానా మిషిగన్ విభాగం-లివోనియా షిర్డీ సాయి ఆలయం సంయుక్తంగా డెట్రాయిట్, ఫార్మింగ్టన్ ప్రాంతీయ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు 300కు పైగా బ్యాగులను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్ శృంగవరపు నిరంజన్, ట్రస్టీ పుట్టగుంట సురేష్, సాంస్కృతిక సేవల సమన్వ్యకర్త పంత్ర సునీల్, ప్రాంతీయ ప్రతినిధి దుగ్గిరాల కిరణ్, తానా ఇమ్మిగ్రేషన్ సేవల విభాగ ఛైర్మన్ కాట్రగడ్డ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, బ్యాక్‌ప్యాక్ కమిటీ ఛైర్మన్ మన్నే సత్యనారాయణలు తానా మిషిగన్ విభాగాన్ని అభినందించారు.