Sports

సానియా సంకల్పం

The Story Behind Sania Mirza's Weight Loss

అమ్మ కావాలంటే అమ్మ పెట్టినవన్నీ తినాలి. డాక్టర్ చెప్పినట్లు చెయ్యాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. డెలివరీ అయిన తరువాత పాలిచ్చే క్రమంలో శరీరంపై శ్రద్ధ పెట్టే అవకాశం ఉండదు. మరి అలానే వదిలేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదు. అందుకే అమ్మ జిమ్ముల్లో కసరత్తులు చేస్తుంది. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు తనని తాను సమాయత్తం చేసుకుంటోంది భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. తల్లి కావడంతో తాత్కాలిక విరామం ఇచ్చినా బాబుకి సంవత్సరం వచ్చేసిందని తన బరువుపై దృష్టి సారించింది. కష్టపడి 4 నెలల్లో 26 కేజీల బరువు తగ్గి మునుపటి సానియాను గుర్తుకు తెస్తోంది. ఈ సందర్భంగా సానియా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అతి కొద్ది కాలంలో ఇంత బరువు ఎలా తగ్గావని అందరూ ప్రశ్నిస్తున్నారని తెలిపింది. అయితే అది మన చేతుల్లోనే ఉంటుందని తగ్గాలనే పట్టుదల ఉంటే నిబద్దతో జిమ్‌లో రోజుకి ఒకటి, రెండు గంటలు వర్కవుట్లు చేయాలని చెప్పింది. తాను బిడ్డకు జన్మనిచ్చిన తరువాత 23 కేజీలు తగ్గాలని ధ్యేయంగా పెట్టుకున్నాను కానీ, 26 కేజీలు తగ్గానని ఆనందంగా చెబుతోంది. శ్రమ, క్రమశిక్షణవల్లే ఇది సాధ్యమైందని సానియా చెప్పుకొచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఇంత బరువు తగ్గడం మామూలు విషయం కాదని చాలా మంది నాకు సందేశాలు పంపుతున్నారు. నాకు సాధ్యమైందంటే మీకూ సాధ్యమవుతుంది.. అయితే చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం మధ్యలో ఆపొద్దు. అప్పుడే రిజల్ట్ మీ సొంతమవుతుంది అని వీడియో షేర్ చేసింది. సానియా గత ఏడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. 2020 జనవరిలోపు అంతర్జాతీయ పోటీలో పాల్గొంటానని అందుకు తన శరీరం కూడా సహకరిస్తుందని తెలిపింది