ట్రెండ్ ఫాలో అయ్యేది, ట్రెండ్ సెట్ చేసేది యువత. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం పెద్దల మాటకే ప్రాధాన్యం అంటున్నది. ఇటీవల యువతపై నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.కెన్యాకు చెందిన స్టడీ ఆన్ యూత్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఎలా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? ఏ వయసులో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? సంప్రదాయాలకు విలువనిస్తారా వంటి ప్రశ్నలతో సర్వే జరిగింది. ఇందులో 27 నుంచి 29 ఏండ్ల మధ్యే పెండ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అధికశాతం మంది వెల్లడించారు. స్నేహితుల ఎంపిక, అలవాట్లు, అభిరుచులు అన్ని అంశాలు ఒక ఎత్తు. వివాహం ఒక ఎత్తు అని సర్వేలో యువత పేర్కొంది. ముఖ్యంగా వివాహం విషయంలో మాత్రం తమ ఆచారాలకు పెద్ద పీట వేస్తామని 71 శాతం మంది యువత పేర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో ఇండియా, చైనా, రష్యా, కెనడా వంటి 16 దేశాల నుంచి యువతను శాంపిల్‌గా తీసుకున్నారు. ఏడాది పాటు సాగిన ఈ సర్వేలో 1634 మంది పాల్గొన్నారు.
సాంప్రదాయాలకే యువత మొగ్గు
Related tags :