భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ మరోమారు తళుక్కుమన్నాడు.
ప్రపంచ టైటిళ్ల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తూ మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐబీఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ టీమ్ ఈవెంటులో ఆదిత్య మెహతాతో కలిసి పంకజ్ అద్వానీ ఒడిసిపట్టుకున్నాడు.
బుధవారం జరిగిన ఫైనల్లో అద్వానీ, మెహతా జోడీ 5-2 తేడాతో థాయ్‌లాండ్ ద్వయంపై విజయం సాధించింది.
అద్వానీ కెరీర్లో ఇది 23వ ప్రపంచ టైటిల్ కాగా, ఆదిత్యకు మొదటిది.
గత వారమే ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ గెలిచిన పంకజ్ తాజాగా మరొటి దక్కించుకుని దాదాపు ప్రతి ఐబీఎస్ఎఫ్ టైటిల్‌పై తన పేరును లిఖించుకున్నాడు.
పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మెహతా 65-31తో తొలి గేమ్‌ను దక్కించుకుంది.
అయితే ప్రత్యర్థి ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి రావడంతో రెండో గేమ్‌ను 9-69తో భారత ద్వయం చేజార్చుకుంది. మిగతా గేముల్లో ఎక్కడా తగ్గకుండా టైటిల్ గెలిచారు.