DailyDose

ట్రంప్ ప్రకటనతో పరుగులు పెట్టిన మార్కెట్లు-వాణిజ్యం-0926

Stock Markets Rise After Trumps Announcement-Business-09/26

* మార్కెట్ మళ్లీ పరుగులు పెట్టింది. రెండు సెషన్లుగా నష్టపోతూ వచ్చిన బెంచ్‌మార్క్ సూచీలు నేడు ర్యాలీ చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ అండ్ టుబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల ర్యాలీ కలిసొచ్చింది. ఆసియా మార్కెట్లు లాభాలతో కళకళలాడటం కూడా మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందానికి సంకేతాలివ్వడం ఇందుకు కారణం. దీంతో గ్లోబల్ మార్కెట్లపై సానుకూప ప్రభావం పడింది. అమెరికా, చైనా మధ్య 15 నెలలుగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ తాజాగా చైనాతో డీల్ త్వరలోనే జరగొచ్చు అని పేర్కొన్నారు. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 565 పాయింట్ల మేర పరుగులు పెట్టింది. 39,158 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 145 పాయింట్లు పెరిగింది. 11,600 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ చివరకు 396 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 11,571 పాయింట్ల వద్ద ముగిసింది.