పిల్లలు మాట్లాడటం మొదలు పెడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుగా మాట్లాడితే సరిదిద్దుతూనే కొత్త పదాలు అలవాటు చేయాలి.
* పిల్లలు మాటలు మొదలుపెట్టినప్పుడు ప్రతిదీ అబ్బురంగానే అనిపిస్తుంది. కాస్త అలవాటు పడ్డాక మాత్రం తప్పొప్పులు గుర్తిస్తాం. వారికి ఆ మాటల్లో అర్థాలు తెలియకపోవచ్చు. దాన్ని మీరు గుర్తించి, సరైన దిశలో వ్యక్తీకరించడం అలవాటు చేయాలి. కోపం, సంతోషం, బాధ… వంటివన్నీ సందర్భానుసారంగా వ్యక్తం చేసేలా చూడాలి.
* పిల్లలు కొన్ని పదాలు తప్పుగా పలుకుతారు. అవి ముద్దుగా అనిపించొచ్చు కానీ సరిదిద్దాలి. లేదంటే పెద్దయ్యాకా అదే కొనసాగిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త పదాలు నేర్పిస్తూ… ఎలా మాట్లాడాలో వివరించాలి. వీలైనంతవరకూ చిన్నచిన్న వాక్యాల్లో, వివిధ వర్ణనలతో సూటిగా, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి.
* రోజూ మీరు చాలా పనులే చేస్తుంటారు. వాటిల్లో మీ పాపాయి కోసం చేసే పనులు చాలానే ఉంటాయి. అవన్నీ వారితో మాట్లాడుతూ చేయండి. న్యాపీలు, దుస్తులు మార్చడం, ఆహారం తినిపించడం… ఇలా ప్రతిదాని గురించి వివరిస్తుంటే వాళ్లకూ తెలుస్తుంది. సులువుగా స్పందిస్తారు. అర్థంచేసుకుని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.
తప్పులు మాట్లాడితే సరిదిద్దండి
Related tags :