DailyDose

సీఐ ఆత్మహత్యతో పోలీస్ శాఖలో కలవరం:నేరవార్తలు-09/26

Vijayawada CI Suicide Sends Disturbances In The Force-Crime News-09/26

* విజయవాడలోని ఓ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సిఐ సూర్యనారాయణ మచిలీపట్నంలో సీఐ గా పనిచేస్తున్నారు. విజయవాడ హనుమాన్‌ పేట పోలీస్‌ క్వార్టర్స్‌ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1989 బ్యాచ్‌ కు చెందిన సూర్యనారాయణ, కొంత కాలంగా విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌ లో బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ఏలూరు రేంజ్‌ లో వీఆర్‌ లో ఉన్నారు. సూర్యనారాయణ ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన మృతిపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యం కారణంతో సూసైడ్‌ చేసుకొని ఉండొచ్చని చెబుతున్న పోలీసులు.. పదోన్నతి రాకపోవడం కూడా ఒక కారణమని భావిస్తున్నారు. అయిదారేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఐ.. తరుచూ సెలవులు తీసుకుంటున్నారు. ఈ విషయమై సిఐ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అంటున్నారు. ఇక 1989 బ్యాచ్‌కు చెందిన సిఐ కు ప్రమోషన్‌ రాకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనారోగ్యమే కారణమన్నది పోలీసుల వాదన. దర్యాప్తు అనంతరం ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

* అతని పేరు విజయ్‌. నగరానికి చెందిన అతను అనాథ.. నా అన్నవారు ఎవరూ లేరు.. డిగ్రీ వరకు చదివాడు. క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తూ జీవితం వెళ్లదీస్తున్నాడు.. ఒంటరి బతుకుపై విరక్తి కలిగింది. ఇలా ఎన్నాళ్లని మథనపడ్డాడు. తన జీవిత పయనాన్ని ముగించాలని నిర్ణయానికొచ్చాడు. తనలాంటి అనాథల మృతదేహాలు దొరికితే అంత్యక్రియలు నిర్వహించే సంస్థ గురించి తెలుసుకున్నాడు. క్యాబ్‌డ్రైవర్‌గా తాను సంపాదించిన రూ. 6 వేలను ఆ సంస్థ (సెర్వ్‌ నీడి)కు అందించాడు. అనాథల శవాలు దొరికితే అంత్యక్రియలకు వినియోగించాలని కోరాడు. మంగళవారం బల్కంపేట నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు లేఖ రాశాడు. తన మృతదేహానికి సెర్వ్‌ నీడి సంస్థ వారు అంత్యక్రియలు చేయాలని కోరాడు. బుధవారం సాయంత్రం అతడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులు వచ్చి సర్వ్‌ నీడి సంస్థ వారికి సమాచారం అందించగా.. వారు అంత్యక్రియలు నిర్వహించారు. అలా అతను తన అంతిమ సంస్కారాలను సైతం ముందుగా అనుకున్నట్టే జరిపించుకోవడం స్థానికులను కదిలించింది. కంటతడి పెట్టించింది.

* ఏవోబీలోని మహిళా మావోయిస్టుల విభాగంలో అరుణ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు అరుణ ఎవరు, ఉద్యమంలో ఆమె బాధ్యత ఏమిటీ, అరుణ కోసం ఏడాదిగా పోలీసు బలగాలు ఎందుకు గాలింపు చేపడుతున్నాయి అన్న ప్రశ్నలు ఏవోబీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్‌కౌంటర్‌లో ఆమె ఉందని ప్రచారం కూడా సాగింది. అయితే ఎదురుకాల్పుల్లో ఆమె లేకపోవడంతో పోలీసు బలగాలు అరుణకోసం జల్లెడపడుతున్నాయి. పెందుర్తి మండలం సుజాతనగర్‌కు చెందిన అరుణ, ఆమె కుటుంబం కూడా మావోయిస్టుల ఉద్యమం నుంచి ఉన్నారు. అరుణ చిన్న వయసులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైంది.

* ఏడాది క్రితం గూడెం మండలం మర్రిపాకల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత ఆజాద్‌ సొంత చెల్లెలు ఈమె. అరుణ ఫొటో రాంగుడ ఎన్‌కౌంటర్లో లభ్యమైన ల్యాబ్‌ట్యాప్‌లో కనిపించింది. ఆమె పేరు తప్ప ఆమె ఎలా ఉంటుందనేది అప్పుడే వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్‌ చీఫ్‌ అయిన చలపతి భార్య అరుణ. ప్రస్తుతం అరుణ పార్టీలో కీలక పదవిలో ఉంది. చలపతి భార్య కావడం, తూర్పు మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఏకే47 తుపాకీ వాడుతున్నట్లు మాజీ మావోయిస్టుల ద్వారా తెలిసింది. అలాగే ఆమెకు ఆరుగురు అంగరక్షకులు కూడా ఉన్నట్లు సమాచారం. రాంగుడ ఎదురుకాల్పుల నుంచి అరుణ బయట ప్రపంచానికి తెలిసింది. అక్కడి నుంచి అందరి మావోయిస్టుల్లాగే పోలీసులు చూసే వారు. కానీ ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అప్పటి నుంచి ఏవోబీ, విశాఖ, తూర్పుగోదావరి పోలీసులు ఆమెను ఎలాగైనా పట్టుకోవాలన్న లక్ష్యంతో గాలిస్తున్నారు.

* రోడ్డు వ‌ద్ద ఉన్న ఓ కాలువ‌లో కారు కొట్టుకుపోయింది. దాంట్లో నుంచి ఓ మృత‌దేహాన్ని వెలికితీశారు. పూణె జిల్లాలో వ‌ర్షాల వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరుకున్న‌ది.

* విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (ణ్-65) పై తెల్లవారుజామున 04గంలకు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన(ఆఫ్ 02 ట్ఛ్ 7695) బస్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట పరిధిలోని దూరజ్ పల్లి వద్ద డివైడర్ ను ఢీకొట్టి పాల్టీ కొట్టింది.ప్రమాద సమయం లో బస్ లో 49 మంది ప్రయాణికులు ఉన్నారు.అందులో 10 కి గాయాలు కాగా,ఒకరి పరిస్థితి విషమం గా ఉంది. పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని 108లో స్థానిక ఆసుపత్రిలకు తరలించారు.

* మధ్యప్రదేశ్‌లో భారీ బ్లాక్ మెయిల్ కుంభకోణం బయటపడింది. 40 మంది కాల్ గర్ల్స్ తోపాటు పలువురు బాలీవుడ్ బీ గ్రేడ్ నటీమణులు.. అధికారులు, రాజకీయ నాయకులతోపాటు మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ కూడా ఈ బ్లాక్ మెయిల్ స్కాండెల్ చిక్కుకోవడం గమనార్హం. ఈ భారీ బ్లాక్ మెయిలింగ్ సిండికేట్‌లో వీరంతా చిక్కుకుని మింగలేక కక్కలేక ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఆ మగువలతో గడిపిన సమయంలో తీసిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్స్ ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకులకు నిద్రలేని రాత్రులను మిగిలుస్తున్నాయి. కాగా, మధ్యప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ షమి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృందం ఈ హనీట్రాప్ బ్లాక్ మెయిలింగ్ కుంభకోణాన్ని ఛేదించింది. కొందరు మహిళలే ఈ సెక్స్, బ్లాక్ మెయిలింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వీడియోలన్నింటినీ సేకరించి ఎక్కడ్నుంచి అప్‌లోడ్ చేశారని విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.