Business

ATMలలో ₹200నోట్లు

200 Rupee Notes To Be Installed In Indian ATMs

త్వరలో కొత్తగా వచ్చిన రెండు వందల రూపాయల నోట్లు ఏటీఎంల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఏటీఎంల్లో ఇవి అందుబాటులో లేవు. కొత్త 200 రూపాయల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను మార్చి..వాటిని అందుబాటులోకి తేవాలని బ్యాంకులను ఆర్ బిఐ ఆదేశించింది. అయితే ఇది అమల్లోకి రావటానికి కొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పుడు కేవలం బ్యాంకుల ద్వారానే ఈ నోట్లను సరఫరా చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరతను తగ్గించడానికి ఆర్ బిఐ తొలిసారి 200 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకులు, ఏటీఏం తయారీదారులు ఎంత వీలైతే అంత త్వరగా రూ.200 నోట్లను ఏటీఎంల ద్వారా అందించడం ప్రారంభించాలని ఆర్‌బీఐ ఆదేశించినట్టు ఓ బ్యాంకరు చెప్పారు. ఇప్పటికే ఏటీఎంల రీక్యాలిబరేట్‌ ప్రారంభమైనట్టు హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ ఎండీ లోని ఆంటోని తెలిపారు. రూ.200 నోట్లను ఎక్కువగా అందించడం కోసం ఆర్‌బీఐ కూడా రూ.2000 నోట్ల ప్రింటింగ్‌ను ఆపివేసిందని భావిస్తున్నారు.