Business

పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం గడువు 30 వరకే

Aadhaar-Pan Must Be Synchronized Before Sep 30

పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈనెల 30తో ముగియనుంది. ఆ తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసే వారు ఆ సందర్భంగా పేర్కొనే ఆధార్ సంఖ్య మేరకు కొత్త పాన్‌ నంబరును జారీ చేస్తామని తెలిపారు. గడువుకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో త్వరపడాలని, వెంటనే పాన్ నంబరుతో ఆధార్‌కార్డును జత చేసుకోవాలని అధికారులు సూచించారు.