ఆంధ్రా గాంధీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ భాషావేత్త మండలి వెంకట కృష్ణారావు 22వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలోని మధు మాలక్ష్మీ ఛాంబర్స్‌లో, అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో నిర్వహించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్ మండలి వెంకట కృష్ణారావు జీవిత విశేషాలను సభికులతో పంచుకున్నారు. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డా.ఈమని శివనాగిరెడ్డి మండలిపై స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి జీ.వీ.పూర్ణచంద్, ప్రముఖ సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో మండలి వెంకట కృష్ణారావు కుమారుడు ఏపీ మాజీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాజీ కలెక్టర్ బీ.ఆర్.మీనాను మండలి పురస్కారంతో సత్కరించారు. మీనా సేవలు దివిసీమను అభివృద్ధి పథంలో నడిపించాయని కొనియాడారు.
వైభవంగా మండలి వెంకటకృష్ణారావు స్మారకోత్సవం
Related tags :