Business

ఏపీలో ఈ-సిగరెట్లు అమ్మకాలు నిషేధం

Selling E-Cigarettes Is Banned In Andhra

ఆంధ్రప్రదేశ్‌లో ఎలకా్ట్రనిక్‌ సిగరెట్లు విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. ఈ-సిగరెట్లను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, రవాణా, నిల్వ, విక్రయాలపై ఈ నెల 10న నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా ఎస్పీలు విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనర్లకు డీజీపీ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు.