WorldWonders

చెమట కారుతోందని విమానం డోర్ తెరిచింది

Woman Opens Emergency Door Because It Was Sweating

తెలిసో తెలియక ప్రయాణికులు చేసే పనులు ఒక్కోసారి విమాన సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. ఫలితంగా విమానం ఆలస్యం కావడమో లేదా రద్దవడమో జరుగుతుంది. తాజాగా చైనాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చైనాలోని గాన్సు నుంచి హుబే ప్రావిన్సులోని వుహాన్‌కు వెళ్లాల్సిన షియామెన్‌ ఎయిర్‌ జెట్‌ టేకాఫ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. ఈలోపు విమానంలో కూర్చున్న ఓ మహిళ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కిటీకిని తెరిచింది. దీంతో విమానం స్టార్ట్‌ కాలేదు. దీన్ని గమనించిన సిబ్బంది ఆమె వద్దకు వెళ్లి అడగ్గా ఉక్కపోతగా ఉందని, గాలికోసం కిటికీని తెరిచినట్లు చెప్పడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు సమాచారమివ్వగా విమానంలో తనిఖీలు చేశారు. దీంతో గంట ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. సోమవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.