* గత కొద్ది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం రోజున ఒక్కసారిగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర 0.14 శాతం తగ్గి రూ.37,740కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గిపోయాయి. కిలో వెండి ధర 0.24శాతం తగ్గి రూ. 46,267కు చేరుకుంది.
* అనంతపురం జిల్లా మడకశిర మండలం గంగులవాయి పాళ్యం చెరువుకు గండి పడటం తో నీరంతా వృథాగా పోతోంది అని దాన్ని పూడ్చడానికి స్వయంగా ఇసుక ముట్లు మోసిన పీసీసీ అధ్యక్షులు రఘువీరా మరియు స్థానిక మడకశిర MRO ఆనందకుమార్
* మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మృతితో పల్నాడు ప్రాంతం ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం నాడు నరసరావుపేట పట్టణంలో కోడెల శివప్రసాద్ కుటుంబసభ్యులను రాయపాటి పరామర్శించారు.
* ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ లో కల్లూరు ఏసిపి వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న సుమారు 50 మంది పోలీసు సిబ్బంది.
* అక్టోబర్ 4నుండి జరుగనున్న అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల లో భాగంగా అక్టోబర్ 9మరియు10వ తేదీలలో వారోత్సవ కార్యక్రమాలు జరుపడానికి తమ కళాశాలను ఇస్రో ఎంపిక చేసినట్లు లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రా డైరెక్టర్ తిమ్మారెడ్డి తెలిపారు.
* వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణం లోని రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నేడు బతుకమ్మ పండుగ ను సైతం లెక్కచేయకుండా యూరియా కావాలని సొసైటీ చుట్టూ తొమ్మిది రోజుల పాటు పడిగాపులు కాస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహించారు. ఈరోజు బతుకమ్మ పండుగ కావడంతో రోడ్లపై రైతులు ఆటపాటలతో బతుకమ్మ లతో రోడ్డెక్కి రైతులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
* టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ను పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని విమర్శించారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. శేఖర్రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్గా నియమించారని విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారని గుర్తుచేశారు.
* కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఆదోని విలేకరుల,ఎపిడబ్ల్యుజెఎఫ్ సంఘం ఆధ్వర్యంలో నేడు దీక్ష చేపట్టరు . ,గౌరవ అధ్యక్షుడు రామదాసు,డివిజన్ ప్రెసిడెంట్, బసప్ప ,కోశాధికారి విజయ్ ,జర్నలిస్ట్ సంఘాల మద్దతు భవిష్యతి కార్యాచరణ లో కూడా న్యాయవాదులకు తోడుగా ఉండి మద్దతు తెలుపుతున్నాము అన్నారు.