వైకాపా ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.
అప్రజాస్వామిక విధానాలపై వంద రోజుల్లోనే బయటకు రావాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను భాజపా నేతలు కలిసి… ఇసుక కొరత, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు, ఆలయ భూముల పరిరక్షణపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.
”ఇసుక అందుబాటులో లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
ఇసుక బ్లాక్‌లో దొరుకుతుందే తప్ప.. సామాన్యులకు లభించటం లేదు.
సచివాలయ ఉద్యోగాల భర్తీ అపహాస్యంగా మారింది.
ఆర్థికంగా వెనకబడినవారికి కేంద్రం 10శాతం రిజర్వేషన్లు కల్పించింది.
సచివాలయ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పట్టించుకోలేదు.
ముఖ్యమంత్రి మాటలకు.. చేతలకు పొంతన లేదు.
దాతలు దేవాలయాలకు ఇచ్చిన భూములను పంచాలనుకోవడం అన్యాయం.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.. లేకపోతే ధర్నా చేపడతాం” అని కన్నా హెచ్చరించారు.