భారత్‌కు పోస్టల్ సర్వీసులను రద్దు చేసిన పాక్
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పాకిస్తాన్‌ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే.
పాకిస్తాన్ భారత్‌పై అన్ని విధాలు విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతూ వస్తోంది.
భారత్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పటికే బస్సు, రైలు సర్వీసులను రద్దు చేయడమే కాకుండా భారత విమానాలకు తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి సైతం నిరాకరించింది.
అంతేకాదు భారత్‌తో వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది.
ఇదే కుట్రలకు కొనసాగింపుగా తాజగా భారత్‌కు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.