ఉగాండా ప్రవాసులతో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆంధ్రపదేశ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంలు సమావేశమయ్యారు. 64 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వీరిరువురూ కంపాల నగరంలో పర్యటిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా మన ఆత్మీయ సంబంధాలు విడిపోలేదని, గడిచిన 5 ఏళ్లుగా సామరస్యంగా శాంతిభద్రతల అదుపులో ఉంటున్నామని పోచారం పేర్కొన్నారు. మానవ వనరులను వాటికి సరిగ్గా జోడించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆయా దేశాల్లో గర్వకారణంగా జీవిస్తున్నారని తమ్మినేని తెలిపారు.
ఉగాండా ప్రవాసులతో పోచారం తమ్మినేనిల భేటీ
Related tags :