“మనిషి ఆహారమే…మనస్సు ఆహార్యము” అని వేదాల మాట. ఎక్కడ శుభ్రమైన వాతావరణంలో రుచికరమైన, పరిమళభరితమైన, ఆహ్లాదకరమైన ఆహారాన్ని మనిషి ఆస్వాదిస్తాడో అతని ఆనందాలు అక్కడి నుండే ప్రారంభమవుతాయి. అలాంటి ఆనందాలను పెంపొందించే వంటకాల్లో భారతీయ రుచులది ప్రథమ స్థానం. ఉత్తర అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో 50కు పైగా శాఖల్లో, భారతీయ దినుసుల మేళవింపుతో వందలకు పైగా రుచులను ప్రవాసులకు వడ్డిస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొన్న “బావర్చి”ది హోటళ్ల రంగంలో ప్రప్రథమ స్థానం. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లేనో నగరంలో గల బావర్చి ప్రధాన శాఖను ఇటీవలే అత్యాధునిక హంగులతో నూతనంగా పునరుద్ధరించారు. 100మంది ఒకేసారి భోజనం చేయగలిగేలా నూతనంగా DineIn శాఖను విస్తరించారు. ప్రవాసుల సమయాన్ని ఆదా చేసే సదుద్దేశంతో వారు ఆర్డర్ ఇచ్చిన వెంటనే సకాలంలో వారి రుచులను వారికి అందించేలా TakeOut విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణ భారతీయ వంటకాలతో పాటు చెఱుకు రసం, బజ్జీ, జిలేబీ, పకోడి, బోండా, కేకులు, ఇండో-చైనీస్ వంటి పలు రకాల వంటకాలు ప్రవాసులకు ప్రతిరోజు ఉదయం 10గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
“వైవిధ్యం, నాణ్యత, శుభ్రత. ఇవి మూడు మా విజయానికి ప్రధాన కారణాలు. ప్రవాసుల జీవితాలు కాలంతో పోటీపడుతుంటాయి. అందుకే వారి సమయాన్ని గౌరవిస్తూ, ఆదా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కలిసి ఉన్న DineIn, TakeOut శాఖలను రెండు భాగాలుగా విభజించాము. తద్వారా వినియోగదారులకు వారు ఆశించిన ఆహార పదార్ధాలను త్వరగా చేరవేసేందుకు ఇది వీలవుతుంది. డెలివరీ, టేక్ఔట్‌లతో పాటు మేము ఇప్పటివరకు పదుల శంఖ్యలో అమెరికాలోని పలు జాతీయ స్థాయి మహాసభలకు క్యాటరింగ్ సేవలు అందించాము. ప్రపంచవ్యాప్తంగా మూడు దేశాల్లో విస్తరించిన మా బావర్చి సంస్థలను ప్లేనోలోని ప్రధాన శాఖ ద్వారా సమన్వయం చేస్తాము. ఈ శాఖలో ప్రత్యేక బ్యాంక్వెట్ హాలు సౌకర్యం కూడా ఉంది. ఒకేసారి 150మంది కూర్చునే విధంగా దీన్ని రూపొందించాం. పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు ఇది చాలా అనువైన సమావేశ మందిరం. ఈ శాఖ మొత్తం 15వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉండటం ద్వారా అధిక సంఖ్యలో వచ్చే వినియోగదారులకు పార్కింగ్ ఇబ్బందులు కూడా తలెత్తవు. 2011 జనవరిలో ప్రారంభించిన మా ఈ సంస్థ 9ఏళ్ల కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రవాసులకు చేరువ కావడం సంతోషంగా ఉంది. వారి అభిప్రాయాలకు అనుగుణంగా వారి ఆదరణ చూరగొనేలా మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము మార్పుకు దగ్గర చేసుకుంటూ ముందుకు వెళ్తామని” బావర్చి సంస్థల అధినేత కంచర్ల కిషోర్ TNIతో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
బావర్చి ఫ్రాంచైజీలకు ఈ దిగువ సమాచారం చూడవచ్చు.
www.bawarchbanquets.com
www.bawarchiplano.com
www.bawarchibiryanis.com
Email: info@bawarchibiryanis.com