కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా ప్లేయర్ల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న ఏకైక ఆటగాడు పారుపల్లి కశ్యప్ కూడా సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ 13–21, 15–21తో వరల్డ్ చాంపియన్, టాప్‌సీడ్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. గతంలో మొమొటాతో తలపడ్డ రెండుసార్లు ఓటమిపాలైన కశ్యప్ మరో సారి అదే రిజల్ట్ను రిపీట్ చేశాడు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలి గేమ్ నుంచే జపాన్ ప్లేయర్ దూకుడు కొనసాగింది. రెండో గేమ్లో కశ్యప్ పుంజుకునే ప్రయత్నం చేసినా అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. బలహీనమైన రిటర్న్స్తో పాటు ర్యాలీలు ఆడటంలో విఫలమయ్యాడు.
కశ్యప్ ఇంటిబాట
Related tags :