ఆళ్లగడ్డలో యురేనియం డ్రిల్లింగ్ జరుగుతోందని ట్విట్టర్లో పవన్ పేర్కొన్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
డ్రిల్లింగ్ విషయంలో అక్కడి ప్రజలు ఆందోళనతో ఉన్నారని చెప్పారు.
అయితే డ్రిల్లింగ్ విషయం కనీసం జిల్లా కలెక్టర్కు కూడా తెలియకపోవటం దారుణమని అభిప్రాయపడ్డారు.
యురేనియం తవ్వకాలకు సంబంధించి జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడుతుందని స్పష్టం చేశారు.
సేవ్ నల్లమల ఉద్యమం కోసం విమలక్క పాడిన పాటకు సంబంధించిన వీడియోను పవన్ ట్విట్టర్లో ఉంచారు.