Business

అక్టోబర్‌లో 11రోజులు బ్యాంకు సెలవులు

11 Days Holidays For Banks In October 2019

బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా? అసలే పండగ సీజన్.. ఏటీఎంల్లో వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి. ఖర్చులకు డబ్బులు దగ్గర పెట్టుకోండి. లేదంటే పండగ రోజున చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడతారు జాగ్రత్త. వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 29 వరకు పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి.

అందులోనూ దసరా, దీపావళి పండగులు కూడా ఇదే నెలలో ఉన్నాయి. అక్టోబర్ 8న దసరా పండగ ఉంటే.. అక్టోబర్ 27న దీపావళి పండుగ ఉంది. మధ్యలో బతకమ్మ పండగతో పాటు రెండో శనివారం,నాల్గో శనివారం, ఆదివారాలు కలిపి మొత్తం 11 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో కలిపి అన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో బ్యాంకుకుఒకో తేదీ వేరేలా ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ నెలలో వచ్చే రెండో, నాల్గో శనివారం, ఆదివారాలు, వేర్వేరు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలీడేస్ కుసంబంధించి అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజుల సెలవుల జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ లో బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను ఓసారి చెక్ చేసుకోండి.

* అక్టోబర్ -2 : గాంధీ జయంతి

* అక్టోబర్ -6 : ఆదివారం

* అక్టోబర్ -7 : నవమి

* అక్టోబర్ -8 : దసరా

* అక్టోబర్ -12 : రెండో శనివారం

* అక్టోబర్ -13 : ఆదివారం

* అక్టోబర్ -20 : ఆదివారం

* అక్టోబర్ -26 : నాల్గో శనివారం

* అక్టోబర్ -27 : దీపావళి

* అక్టోబర్ -28 : గోవర్ధన్ పూజ

* అక్టోబర్ -29 : భాయ్ దూజ