అక్టోబరు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 3,500 మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించనుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో మద్యం దుకాణాలు నడవనున్నాయి. షాపుల పనివేళల్లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది.ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతుండటంతో అధిక ధరలకు విక్రయాలు, నకిలీ మద్యం విక్రయాలు కొంత మేర తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం నుంచి ప్రభుత్వ దుకాణాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నిల్వ ఉన్న సరుకును సోమరవారం రాత్రి 10 గంటల్లోగా అమ్ముకోవాల్సి ఉంది. దీంతో మద్యం వ్యాపారాలు ప్రీమియం బ్రాండ్‌లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత ప్రైవేటు మద్యం షాపుల్లో ఉన్న స్టాకును ఎక్సైజ్ శాఖకు అప్పగించాల్సి ఉండటంతో నిల్వ ఉన్న సరకుపై డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో మందుబాబులు పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గత రెండు వారాలుగా రెగ్యులర్‌గా ఎక్కువగా అమ్ముడుపోయే బ్రాండ్లను మాత్రమే మద్యం వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేశారు.
ఏపీలో ప్రభుత్వ సారాయి దుకాణాలు ప్రారంభం
Related tags :