భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నియంత్రణాధీన రేఖ (ఎల్‌ఒసి) అత్యంత పవిత్రమైనదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అయితే పదేపదే ఇస్లామాబాద్ కనుక కవ్విస్తుంటే ఎల్‌ఒసి దాటి వెళ్లి తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన అన్నారు. ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ రావత్ 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ మొదలైన అనేక అంశాలను ప్రస్తావించారు. భారతదేశానికి హైడ్ అండ్ సీక్ ఆట ఆడటంలో ఎలాంటి ఇంటరెస్ట్ లేదని ఆయన అన్నారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను ఏరివేయడానికి భారత సైన్యం ఎల్‌ఒసి దాటి వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
తోక జాడిస్తే….తిత్తి తీస్తా!
Related tags :